హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

JGL: తన జన్మదినం సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, సతీమణి రాధికతో కలిసి తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.