హైదరాబాద్: 28°C
వార్తలు

'పెండింగ్ స్కాలర్షిప్‌లను వెంటనే విడుదల చేయాలి'

MBNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్‌లను వెంటనే విడుదల చేయాలని SFI జిల్లా కార్యదర్శి భరత్ డిమాండ్ చేశారు. ఇవాళ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ మహబూబ్‌నగర్ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల కాస్మెటిక్ చార్జీలను విడుదల చేయాలన్నారు.