హైదరాబాద్: 28°C
వార్తలు

అడ్మిషన్లు అందజేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత

SS: రామగిరి మండలం నసనకోట ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ కోర్సులు ప్రారంభమయ్యాయి. పదో తరగతిలో 450కు పైగా మార్కులు సాధించి దరఖాస్తు చేసిన విద్యార్థినుల దరఖాస్తులను రిజర్వేషన్ ప్రకారం పరిశీలించారు. అనంతరం తిరుమల దేవర వెంకటేశ్వరస్వామికి పూజల తర్వాత అడ్మిషన్లను MLA పరిటాల సునీత విద్యార్థులకు అందజేశారు.