హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ ఉప ప్రధానికి నివాళి అర్పించిన ఇన్‌ఛార్జ్

NTR: తిరువూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్‌రామ్ 40వ వర్ధంతిని నిర్వహించారు. ఫ్యాక్టరీ సెంటర్‌లోని జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్‌ను స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయ నాయకుడిగా కొనియాడారు.