AP: విశాఖలో భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టరుకు MLA గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు. ప్రభుత్వ ఆస్తులను కాజేసేందుకు యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో భూములను కాజేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని లేఖలో పేర్కొన్నారు.
వార్తలు
VSPలో భూ అక్రమాలపై విచారణ జరపాలి: గంటా


