హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: బస్సు షెల్టర్ లేక ఇబ్బందులు

ADB: ఉట్నూర్ మండలంలోని ఎక్స్ రోడ్డు నుంచి జైనూర్ వెళ్లే మార్గమధ్యంలోని క్రాసింగ్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు ఎండ, వర్షాల నుంచి రక్షణ పొందే అవకాశం లేక అవస్థలు పడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రయాణీకులు కోరుతున్నారు.