AP: కాకినాడ జిల్లా తునికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి నెల రోజులు గడిచింది. జూన్ 6న ఇంటి సమీపంలో తండ్రి కోసం వెతుకుతూ వెళ్లిన ఆ పాప ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. పోలీసులు ఆ ప్రాంతాన్ని రోజుల తరబడి గాలించినా ఫలితం లేకపోయింది. తమ బిడ్డ క్షేమంగా తిరిగొస్తుందనే ఆశతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ.. పోస్టర్లతో గాలింపు కొనసాగిస్తున్నారు.
వార్తలు
తుని చిన్నారి మిస్సై నెల.. ఆచూకీ తెలిసేదెలా!


