హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ పథకాలను గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

BDK: జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన, వనమహోత్సవం, పారిశుధ్యం, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై సమీక్షించారు. గ్రామస్థాయిలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేయకుండా, నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అధికారులను ఆదేశించారు.