హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు

ముంబైలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు మాన్‌ఖుర్ద్‌లో భవనం కూలి ఆరుగురు మృతిచెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా ముంబై, ఠాణే, పాల్‌ఘర్‌లో ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలతో ముంబైకి ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.