హైదరాబాద్: 28°C
వార్తలు

జూదం ఆడుతున్న నలుగురిపై కేసు నమోదు

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని బుద్ధ విహార సమీపంలో జూదం ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 1600 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.