ఖమ్మం: జిల్లాలో బోదకాలు నిర్మూలనకు ఈరోజు నుంచి 18 వరకు 'ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వే' నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డి.రామారావు తెలిపారు. 11 పీహెచ్‌సీల పరిధిలోని 31 గ్రామాల్లో 20 ఏళ్లు దాటిన వారికి రక్త పరీక్షలు చేస్తారు. వ్యాధి ఉంటే వెంటనే చికిత్స అందిస్తామని, దోమల నివారణకు స్ప్రేయింగ్ చేయిస్తామని చెప్పారు. ప్రజలు వైద్య సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
జిల్లాలో నేటి నుంచి ఫైలేరియా సర్వే: డీఎంహెచ్ఓ


