హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: శబ్ద కాలుష్యం సృష్టిస్తే వాహనాలను సీజ్.. సీఐ హెచ్చరిక

KKD: వాహనాల సైలెన్సర్లను మోడిఫై చేసి శబ్ద కాలుష్యం సృష్టిస్తే వాహనాలను సీజ్ చేస్తామని కాకినాడ ట్రాఫిక్-1 CI నూని రమేశ్ హెచ్చరించారు. ఆదివారం కాకినాడ మెయిన్ రోడ్డుపై మోడిఫైడ్ సైలెన్సర్లు, త్రిబుల్ రైడింగ్‌పై ఆయన ప్రత్యేక అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.