NGKL: లింగాల మండలం అంబటిపల్లి- యాపట్ల రహదారిపై ఆదివారం లింగాల ఎస్సై చంద్రకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. బ్రెత్ అనలైజర్ పరీక్షల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిన 8 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
వార్తలు
లింగాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు..!


