హైదరాబాద్: 28°C
వార్తలు

కిరాణా దుకాణంలో రేషన్ బియ్యం పట్టివేత

KNR: హుజురాబాద్ పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని ఓ కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వ చేసిన రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన తనిఖీల్లో బియ్యం నిల్వలు గుర్తించారు. ఫుడ్ ఇన్స్‌స్పెక్టర్ సమాచారం అందించి బియ్యాన్ని సీజ్ చేసి ప్రభుత్వ రేషన్ దుకాణానికి తరలించారు.