హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు రోడ్డు నిర్మించాలని నిరసన.. వ్యక్తిపై కేసు

KNR: వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ మోరె దివాకర్ లారీని రోడ్డుకు అడ్డంగా నిలిపి వాహనాల రాకపోకలను అడ్డుకున్నాడు. పోలీసుల సూచనలను పట్టించుకోకుండా విధుల్లో ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పాటు ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించాడు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి వెల్లడించారు.