హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి: మాజీ MLA

TG: కాళేశ్వరంలో నీళ్లు లేవంటున్న సీఎం రేవంత్, మంత్రులు దమ్ముంటే కన్నెపల్లి పంప్‌హౌస్‌కు రావాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సవాల్ విసిరారు. కేటీఆర్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. ప్రాజెక్టును బదనాం చేయడానికే కాంగ్రెస్ మరమ్మతులు చేయడం లేదని, కాఫర్ డ్యామ్ కట్టి నీటిని ఆపవచ్చన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని కోరారు.