హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 7న 'చలో విజయవాడ'

AP: మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న చేపట్టే ‘చలో విజయవాడ’ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నేతలు పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, గత నెల 20 నుంచి దశలవారీగా పోరాటాలు చేసినా చలనం రాకపోవడంతోనే ఈ ధర్నాకు పిలుపునిచ్చినట్లు వారు స్పష్టం చేశారు.