E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తొలిసారి వాహనదారులు నిరసనకు దిగారు. ఈ ఆందోళనల్లో పారిశ్రామికవేత్త పూనావాలతో పాటు ప్రజలు పాల్గొన్నారు. తమ ఉద్యమానికి రాజకీయ రంగు లేదని.. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని కేవలం విధానంపై మాత్రమే పోరాటం చేస్తున్నామని నిరసనకారులు తెలిపారు. ఈ పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గడంతో పాటు ఇంధన వ్యవస్థ దెబ్బతింటోందన్నారు.
వార్తలు
E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా తొలిసారి నిరసనలు


