హైదరాబాద్: 28°C
వార్తలు

'భూ వివాదంలో మహిళను చంపేస్తామని బెదిరింపులు'

NLR: కాలువ దారి వివాదంలో ఓ మహిళను అడ్డుకుని, చంపేస్తామని బెదిరించిన ఐదుగురిపై బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. చల్లాయపాలెం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి ఉమకు చెందిన 99 సెంట్ల వ్యవసాయ భూమికి వెళ్లే కాలువ దారి విషయంలో ఆమె బావ తమ్మిరెడ్డి మల్లికార్జునతో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొంతమందితో కలిసి మల్లికార్జున ఆమెను బెదిరించారన్నారు.