మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు. వీరిలో గత ఐదు రోజుల్లో ముంబైలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వర్షాల కారణంగా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోసారి వర్ష సూచన ఉందంటూ ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
వార్తలు
భారీ వర్షాలు.. 13 మంది మృతి


