హైదరాబాద్: 28°C
వార్తలు

బోరింగ్‌కు మరమ్మతులు చేయరా.?

PLD: రొంపిచర్ల (మం) సంతగుడిపాడు కాలనీలో మేరీమాత రోడ్డులోని తాగునీటి బోరింగ్ పంపు నెల రోజులుగా పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 20 రోజుల క్రితం మరమ్మతుల కోసం వచ్చిన మెకానిక్ బోరింగ్‌ను తెరిచి విడిభాగాలు తీసి వెళ్లిపోయాడు. ఈ విషయం పంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన చెందారు. వెంటనే బోరింగ్‌కు రిపేర్ చేయాలని కోరుతున్నారు.