NRML: దిలావర్‌పూర్ మండల కేంద్ర గ్రంథాలయ అధికారి కటకం సంజీవరెడ్డికి ఆదివారం స్థానికులు ఘనంగా వీడ్కోలు పలికారు. జగిత్యాల జిల్లా సెంట్రల్ లైబ్రేరియన్‌గా పదోన్నతి పొంది బదిలీపై వెళ్తున్న సందర్భంగా శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. విద్యార్థుల్లో పుస్తక పఠన అలవాటు పెంపొందించడంలో ఆయన చేసిన సేవలను యువకులు కొనియాడారు.
వార్తలు
గ్రంథాలయ అధికారికి ఘన వీడ్కోలు


