హైదరాబాద్: 28°C
వార్తలు

భారత గృహిణికి రూ.65 కోట్ల జాక్‌పాట్‌

యూఏఈలో ఉంటున్న భారత గృహిణికి జాక్‌పాట్ తగిలింది. అబుధాబీలో ప్రతి నెల నిర్వహించే బిగ్ టికెట్‌లో ఢిల్లీకి చెందిన కనికా అరోడా అనే మహిళ రూ.65 కోట్ల ప్రైజ్ మణి పొందింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. డ్రాలో గెలుపొందిన విషయం తెలియగానే తొలుత నమ్మశక్యంగా అనిపించలేదని తెలిపారు. గత మూడేళ్లుగా ఈ డ్రాలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. వచ్చిన డబ్బుతో ఇల్లు కొంటామని చెప్పారు.