ఒడిశా సీఎం మోహన్ చరణ్‌ను కించపరిచేలా రీల్స్ పోస్ట్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కటక్‌కు చెందిన బిశ్వజిత్‌గా గుర్తించారు. అతడిపై సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఎంను కించపరిచేలా నిందితుడు కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని.. అవి వైరల్ కావడంతోనే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వార్తలు
సీఎంని కించపరిచేలా రీల్స్.. యువకుడి అరెస్టు


