హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పగటిపూట వెలుగుతున్న స్ట్రీట్ లైట్లు

NTR: జగ్గయ్యపేటలోని విష్ణుప్రియా నగర్‌లో ఉదయం నుంచి స్ట్రీట్ లైట్లు వెలుగుతూనే ఉండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లల్లో స్వల్పంగా విద్యుత్ వాడినా బిల్లులు భారమవుతున్న తరుణంలో, ప్రభుత్వ వ్యవస్థలు వందలాది లైట్లను పగటిపూట కూడా ఆర్పకుండా వదిలేయడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు విమర్శిస్తున్నారు.