హైదరాబాద్: 28°C
వార్తలు

సుగాలి ప్రీతి తల్లి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు

కృష్ణా: గన్నవరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుగాలి ప్రీతి బాధిత తల్లి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యూట్యూబ్ ఛానల్ 'ప్రశ్న రావణ్' నిర్వాహకుడు రావణ్‌పై వరుస కేసులు నమోదు చేసి, భారీ పోలీసు యంత్రాంగాన్ని వినియోగించడం ప్రజాధన దుర్వినియోగమని ఆరోపించారు. ఇదే చొరవను సుగాలి ప్రీతి, జ్ఞానేశ్వరి కేసుల్లో చూపి ఉంటే బాధితులకు న్యాయం జరిగేదని అన్నారు.