హైదరాబాద్: 28°C
వార్తలు

FIFA గర్ల్స్ అకాడమీకి కల్వకుర్తి అమ్మాయి ఎంపిక

NGKL: కల్వకుర్తికి చెందిన ఆనందవర్షిణి భారతదేశంలో తొలిసారిగా తెలంగాణలోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన FIFA గర్ల్స్ అకాడమీకి ఎంపికైంది. ఈ సందర్భంగా కల్వకుర్తి ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆమెను ఘనంగా సన్మానించింది. గత ఆరు సంవత్సరాలుగా కోచ్ వెంకట్రాములు ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఆనందవర్షిణి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకుందని అభినందించారు.