హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటర్ల సర్వేను తనిఖీ చేసిన కలెక్టర్

WG: భీమవరం పద్మశాలీల బజార్‌లో BLOలు చేపట్టిన ఇంటింటి ఓటర్ల సర్వేను కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 18 ఏళ్లు నిండిన అర్హులందరూ ఓటుహక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. మృతిచెందిన వారి పేర్ల తొలగింపు, నకిలీ ఓట్ల నివారణే ప్రధాన లక్ష్యంగా సర్వే కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను విజయవంతం చేయడానికి ప్రజలంతా BLOలకు పూర్తిగా సహకరించాలని ఆమె కోరారు.