హైదరాబాద్: 28°C
వార్తలు

కోడిపందాలు ఆడుతూ ఎనిమిది మంది పట్టుబడ్డారు

అన్నమయ్య: చిట్వేల్ మండలం మల్లంపల్లి గ్రామ సమీప అడవిలో కోడిపందేలు నిర్వహిస్తున్న 8 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.26,400 నగదు, 7 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వినోద్ కుమార్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు, ఈ చర్యలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నట్లు వెల్లడించారు.