హైదరాబాద్: 28°C
వార్తలు

కాకాణి నగర్ వద్ద ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్‌కు అనుమతి

NLR: పొదలకూరులోని కాకాణి రమణారెడ్డి నగర్ వద్ద ఆర్టీసీ బస్సులు నిలిచేలా రిక్వెస్ట్ స్టాప్‌కు అధికారిక అనుమతి లభించింది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ సురేష్ రెడ్డి చొరవతో ఈ సమస్య పరిష్కారమైంది. రాపూరు, నెల్లూరు-1 డిపో మేనేజర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడ స్టాప్ బోర్డును ఏర్పాటు చేశారు.