హైదరాబాద్: 28°C
వార్తలు

వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NDL: వెలుగోడు మండలం తిమ్మాపురంలో ఆదివారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు టీడీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. ప్రజల దాహార్తిని తీర్చడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.