హైదరాబాద్: 28°C
వార్తలు

బస్సును ఢీకొన్న ట్రాక్టర్

KDP: కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై పైడిమాను కాలనీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. కడప నుంచి ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న బస్సును వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో బస్సు స్వల్పంగా దెబ్బతింది. అయితే ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.