హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్

ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. బీహార్ బంకీపూర్ నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ ప్రకటించారు. బీజేపీ కంచుకోట అయిన ఈ స్థానంలో ఈ నెల 30న ఉప ఎన్నికల జరగనుంది. ఆగస్టు 03న ఫలితాలు వెలువడనున్నాయి. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నిబీన్ ఎన్నికయ్యారు.