హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. 15 విమానాలు దారి మళ్లింపు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ ప్రతికూలతల కారణంగా ల్యాండ్ అయ్యే పరిస్థితులు లేకపోవడంతో 15 విమానాలను అధికారులు దారి మళ్లించారు. వీటిలో 5 ఇంటర్నేషనల్, 10 డొమెస్టిక్ విమానాలు ఉన్నాయి. వీటిని జైపూర్, లక్నోకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే వరదల నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.