హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రహ్మంగారి గృహ పునర్నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం

KDP: కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గృహ పునర్నిర్మాణం కోసం ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం సింగమనేనిపల్లెకు చెందిన పునాటి రమేశ్, రమాదేవి దంపతులు ఆదివారం రూ.2,00,016 విరాళం అందజేశారు. ఇటీవల పురాతన గృహం కూలిపోవడంతో ప్రభుత్వం పునర్నిర్మాణ పనులు చేపట్టగా, దాతలు తమ వంతు సహకారం అందించారు.