హైదరాబాద్: 28°C
వార్తలు

సమగ్ర ఓటరు జాబితా సవరణ కోసం ప్రత్యేక కౌంటర్

MDK: రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. బీఎల్వోలు గ్రామస్థుల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను స్వీకరించి, అవసరమైన వివరాలను నమోదు చేస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ సవరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.