హైదరాబాద్: 28°C
వార్తలు

పెరుగుతున్న వీధికుక్కల బెడద

SKLM: గార మండలం జొన్నలపాడులో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులుగా సంచరిస్తూ చిన్నారులు, వృద్ధులు, వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల కుక్కల బెడద మరింత పెరగడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధికుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.