హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.65 లక్షల టపాసులు సీజ్.. ఇద్దరిపై కేసు

KDP: జమ్మలమడుగు పరిధిలోని ముద్దనూరు రోడ్డులో రేకులషెడ్డు‌లో అక్రమంగా నిల్వ చేసిన రూ.65 లక్షల విలువైన టపాసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ టపాసులు పట్టుబడ్డాయి. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ నరేష్‌బాబు తెలిపారు. అనుమతులు లేకుండా నిర్వహించే వ్యాపారాలపై ప్రజలు సమాచారం ఇవ్వాలన్నారు.