హైదరాబాద్: 28°C
వార్తలు

దివ్య అలంకరణలో దర్శనమిచ్చిన చౌడమ్మ

NDL: నందవరం శ్రీ చౌడేశ్వరీ అమ్మవారు ఆదివారం భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయాన్ని పూలతో సుందరంగా ముస్తాబు చేయగా, అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి అమ్మవారి కృప కలగాలని ప్రార్థించారు. కాగా, ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో మారు మోగింది.