హైదరాబాద్: 28°C
వార్తలు

విరాళాల చోరీ కేసులో సంచలన విషయాలు

అయోధ్య రామాలయ కానుకుల చోరీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అవినాష్ శుక్లా రూ.15 లక్షలకు పైగా జరిపిన ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. అలాగే నిందితుడు తన స్నేహితురాలికి రూ.2 లక్షల నగదుతో పాటు ఒక ఖరీదైన ఫోన్‌ను బహుమతిగా ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఈ డబ్బు విరాళాలతో ఖర్చు చేసినవా లేక సొంత నిధులా అనేది తెలియాల్సి ఉంది.