హైదరాబాద్: 28°C
వార్తలు

పలు సెక్షన్ల కింద రావణ్‌పై కేసు నమోదు

AP: డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ జోసెఫ్(రావణ్)ను గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 147, 148, 152, 192, 197(1D), 353(1B) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటితో పాటు 1967 ఉపా చట్టం సెక్షన్ 39 కింద కేసు నమోదైంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద రావణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.