హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు మామిడి రైతులకు శిక్షణ కార్యక్రమం

JGL: గొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్ రైతు వేదికలో సోమవారం (జూలై 6) ఉదయం 9:30 గంటలకు ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మామిడి రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. కొమ్మ కత్తిరింపులు, నీటి-ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణ, పిచికారీ మందుల వినియోగంపై శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం డా. ఏ. భగవాన్ అవగాహన కల్పిస్తారు.