ATP: తాడిపత్రిలో రోటరీ క్లబ్ అందిస్తున్న సామాజిక సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ఆదివారం రోటరీ క్లబ్ కార్యాలయంలో ఆర్థికంగా వెనుకబడిన విభిన్న ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రఫీ, కార్యదర్శి భరత్ మాట్లాడుతూ ప్రతి నెలా 55 మందికి పైగా విభిన్న ప్రతిభావంతులకు బియ్యం, కిరాణా సామగ్రి అందజేస్తున్నామని తెలిపారు.
వార్తలు
55 మందికి బియ్యం, కిరాణా సామగ్రి పంపిణీ


