SS: గోరంట్ల మండలం వానవోలు పంచాయతీ బాచన్నపల్లిలో రైతు కృష్ణమూర్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయనకు చెందిన రెండు కాడెద్దులు పాముకాటుకు గురై ఆదివారం మృతి చెందాయి. వ్యవసాయ పనులకు ఉపయోగించే ఎద్దులను కోల్పోవడంతో రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. మృతిచెందిన ఎద్దుల విలువ సుమారు రూ.1.75 లక్షలు ఉంటుందని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతు తెలిపారు.
వార్తలు
పాముకాటుతో ఎద్దులు మృతి


