హైదరాబాద్: 28°C
వార్తలు

మర్రిపాడులో యథేచ్ఛగా ఆక్రమణలు.?

NLR: మర్రిపాడు మండలం కిష్టాపురం గ్రామంలో జాతీయ రహదారి పక్కన పొలాలకు వెళ్లే దారిని ఆక్రమిస్తున్నారని దళిత రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు హెచ్చరిక బోర్డులను రెండుసార్లు పెట్టినా పీకి పారేసి మళ్లీ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని, తమ పొలాలకు వెళ్లే దారిని కాపాడి ఆక్రమణలు తొలగించాలని రైతులు అధికారులను కోరుతునారు.