ఒడిశాలోని పూరీ తీరంలో మరో బోటు చిక్కుకుపోయింది. APలోని విశాఖకు చెందిన ఒక మత్స్యకార బోటు సముద్రం మధ్యలో సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఆ బోటులో ప్రయాణిస్తున్న 9 మంది మత్స్యకారులు సముద్ర అలల తాకిడికి కదల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదాన్ని గమనించిన బాధితులు వెంటనే ఒడిశా అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి.
వార్తలు
BREAKING: సముద్రంలో చిక్కుకున్న మరో బోటు


