హైదరాబాద్: 28°C
వార్తలు

ముంబైని ముంచెత్తిన రికార్డు స్థాయి వర్షాలు

మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. గడిచిన 24 గంటల్లో నగరంలో 25-39 సెంటీమీటర్ల మేర రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ముంబై, రాయగఢ్, పాల్ఘర్, థానే జిల్లాలకు వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. బాధితుల సహాయార్థం హెల్ప్‌లైన్ నంబర్ 1916ను ఏర్పాటు చేశారు.