హైదరాబాద్: 28°C
వార్తలు

దేశవ్యాప్తంగా వాతావరణ హెచ్చరికలు జారీ

దేశవ్యాప్తంగా ఐఎండీ వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గోవా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బెంగాల్, జార్ఖండ్, అసోం, మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.