హైదరాబాద్: 28°C
వార్తలు

గద్వాల నిరుద్యోగులకు ఉచిత పోలీస్, SI శిక్షణ

GDWL: గద్వాల నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉచిత పోలీస్, ఎస్ఐ ఉద్యోగాల శిక్షణ ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆదివారం తెలిపారు. త్వరలోనే అనుభవజ్ఞులైన అధ్యాపకులతో కోచింగ్ ప్రారంభం కానుందన్నారు. తరగతుల ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.