హైదరాబాద్: 28°C
వార్తలు

రామలింగేశ్వరునికి విశేష అలంకరణ

ATP: తాడిపత్రి పట్టణంలోని చారిత్రక శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తులకు విశేష అలంకరణలో స్వామివారు దర్శనమిచ్చారు. వీకెండ్ కావడంతో తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, రంగురంగుల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించారు.